: ఓటుకు నోటులో జగన్ నూ విచారించాల్సిందే... టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్


తెలుగు రాష్ట్రాల మధ్య ఆరని చిచ్చును రగిల్చిన ఓటుకు నోటు కేసులో వైసీపీ అధినేత, ఏపీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా విచారించాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో జగన్ కూ పాత్ర ఉందని చెప్పిన వర్ల, జగన్ కాల్ డేటాను పరిశీలించి నిష్పక్షపాతంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు నిజమని తేలితే, జైలుకెళ్లేందుకు సిద్ధమన్న తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యలపైనా వర్ల స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలను త్వరలోనే బయటపెట్టనున్నామని, జైలుకెళ్లేందుకు నాయిని సిద్ధంగా ఉండాలని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News