: తెలుగు రాష్ట్రాల్లో 'అమృత్' పట్టణాలివే!


'అమృత్' (అటల్ పట్టణ రూపాంతరీకరణ పునరుజ్జీవన పథకం)లో భాగంగా తెలంగాణ నుంచి 15, ఆంధ్రప్రదేశ్ నుంచి 31 పట్టణాలను కేంద్రం ఎంపిక చేసింది. ఈ పట్టణాల్లో మౌలిక వసతుల మెరుగు, రోడ్లు, మంచినీరు, పారిశుద్ధ్యం తదితర సదుపాయాలకు కేంద్రం నుంచి మరిన్ని నిధులందనున్నాయి. కాగా, తెలంగాణ నుంచి ఎంపికైన 15 'అమృత్' నగరాలు, పట్టణాల్లో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, మహబూబ్‌ నగర్, ఖమ్మం, మంచిర్యాల, నల్గొండ, కొత్తగూడెం, సిద్దిపేట, ఆదిలాబాద్, సూర్యాపేట, మిర్యాలగూడెం, జగిత్యాలలకు స్థానం లభించింది. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, రాజమండ్రి, కాకినాడ, కడప, విజయనగరం, ఏలూరు, ప్రొద్దుటూరు, అనంతపురం, నంద్యాల, ఒంగోలు, ఆదోని, మదనపల్లి, చిత్తూరు, మచిలీపట్నం, చీరాల, తెనాలి, హిందూపురం, శ్రీకాకుళం, భీమవరం, ధర్మవరం, గుంతకల్, గుడివాడ, నర్సరావుపేట, తాడిపత్రి, తాడేపల్లిగూడెం, చిలకలూరిపేటల పేర్లున్నాయి.

  • Loading...

More Telugu News