: బ్రిటన్ లో జడలు విప్పిన జాత్యహంకారం...భారతీయుడిపై దాడిని హత్యానేరంగా పరిగణించని కోర్టు


బ్రిటన్ లో జాత్యహంకారం పేట్రేగిపోయింది. ఆ దేశంలోని ప్రవాస భారతీయుడిపై జాత్యహంకారంతో ఊగిపోయిన జాక్ డేవీస్ అనే వ్యక్తి మారణాయుధాలతో దాడికి పాల్పడ్డాడు. అయితే ఈ దాడిలో భారతీయుడిని చంపేందుకు నిందితుడు యత్నించలేదన్న మోల్డ్ క్రౌన్ కోర్టు అతడిపై హత్యాయత్నం ఆరోపణలను తోసిపుచ్చింది. ఈ ఏడాది జనవరి 14న వేల్స్ నగరం మోల్డ్ లో జరిగిన ఈ దారుణ ఘటనలో ప్రవాస భారతీయుడు శరన్ దేవ్ భాంబ్రాపై జాక్ డేవీస్ మారణాయుధాలతో దాడికి దిగాడు. ఉద్దేశపూర్వకంగానే జాక్ దాడి చేశాడని చెప్పిన కోర్టు, ఈ నేరాన్ని తీవ్రంగా పరిగణించలేదు. దీంతో ఆ దేశ కోర్టు జాత్యహంకార దాడులను ప్రోత్సహించేలా వ్యవహరించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News