: అది నా వల్ల కాదు: సెక్షన్-8 అమలుపై గవర్నర్ నరసింహన్!
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-8 నిబంధనల ప్రకారం, 'ఓటుకు నోటు' కేసును తాను పర్యవేక్షించలేనని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెప్పినట్టు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. సెక్షన్-8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలను గవర్నర్ తన చేతుల్లోకి తీసుకోవచ్చని, డీజీపీలతో చర్చించి, పర్యవేక్షించవచ్చని భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సూచించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సలహా అమలు సాధ్యం కాదని గవర్నర్ స్వయంగా చెప్పినట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు నరసింహన్ ను కలసి మీడియాలో వస్తున్న 'పర్యవేక్షణ' వార్తలపై అడుగగా, రోహత్గీ తనకు సలహా ఇచ్చారని, అయితే దానిని పక్కనపెట్టానని గవర్నర్ వారికి స్పష్టం చేసినట్టు సమాచారం.