: అందరి దృష్టి హైకోర్టు విచారణపైనే... రేవంత్ బెయిల్ పై ఉత్కంఠ!
ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై నేడు ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు విచారణ జరపనుంది. కింది కోర్టులో బెయిల్ లభించకపోవడంతో రేవంత్ రెడ్డి సహా మరో ఇద్దరు నిందితులు సెబాస్టియన్, ఉదయ సింహలు హైకోర్టును ఆశ్రయించారు. ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేయరాదని నిన్న తెలంగాణ ఏసీబీ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని ఏసీబీ తన పిటీషన్ లో పేర్కొంది. బెయిల్ ఇస్తే, తాము చేస్తున్న దర్యాప్తునకు ఆటంకం కలిగే అవకాశాలున్నాయని ఏసీబీ వాదించనుంది.