: ఇక గోవా వెళ్లక్కరలేదు, ఏపీలో 39 బీచ్ రిసార్టులు!


బీచ్ లలో అద్భుతమైన సాయంత్రాలు, సముద్రం ఒడ్డున అర్ధరాత్రిళ్లు గడపాలంటే ఇకపై గోవా, ధాయ్ లాండ్, పుకెట్ లాంటి ప్రదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ లోని సువిశాలమైన తీర ప్రాంతం వెంబడి 39 రిసార్టులు ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. హైదరాబాదులో పర్యాటక శాఖపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లంబసింగి, హార్స్ లీ హిల్స్ ను వేసవి విడిది కేంద్రాలుగా తయారు చేస్తామని అన్నారు. ఎకో టూరిజం ఏర్పాటుకు అటవీశాఖతో కలిసి పర్యాటక శాఖ పనిచేయాలని ఆయన సూచించారు. ఎకో టూరిజం పార్కుకు ప్రతి జిల్లాలో 300 ఎకరాలు కేటాయించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News