: జపాన్ రాజధానిలో భారీ భూకంపం
మానవాళికి పెను ముప్పు పొంచి ఉందా? భూగోళం ప్రమాదం అంచుల్లో వేలాడుతోందా? అన్న అనుమానాలు రేకెత్తించేలా ఇటీవల కాలంలో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. నేపాల్ ను భూకంపం అతలాకుతలం చేసిన అనంతరం ఇంకా అక్కడ ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. తాజాగా, జపాన్ రాజధాని టోక్యో దక్షిణభాగంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.9గా నమోదైంది. ఒగాసవారా ఐలాండ్ కు సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటివరకు దీనిపై సునామీ హెచ్చరికలు జారీకాలేదు. నష్టం వివరాలు తెలియరాలేదు.