: అప్పుడు సెక్షన్ 8 గుర్తు రాలేదా?...ఇప్పుడు సెక్షన్ 8 అమలు చేయాలా?: శైలజానాధ్


ఆంధ్రప్రదేశ్ మంత్రులు, టీడీపీ నేతలకు ఉన్నపళంగా సెక్షన్ 8 ఎందుకు గుర్తుకు వచ్చిందని మాజీ మంత్రి సాకే శైలజానాధ్ ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు హైదరాబాదులోని విద్యా సంస్థల్లో చదివేందుకు అవకాశం లేదని, వారిని ఇతర రాష్ట్రాల వారిగా పరిగణిస్తామని విద్యాశాఖ చెప్పినప్పుడు సెక్షన్ 8 ఎందుకు గుర్తు రాలేదని నిలదీశారు. హైదరాబాదులోని యూనివర్సిటీల్లో ఏపీ విద్యార్థుల ప్రవేశాలు అడ్డుకున్నప్పుడు ఏపీ మంత్రులకు సెక్షన్ 8 ఎందుకు గుర్తు రాలేదని ఆయన ప్రశ్నించారు. కనీసం, సాగర్ జలాల కోసం రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పుడు ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు సెక్షన్ 8 పెట్టాలని ఎందుకు డిమాండ్ చేయలేదని ఆయన అడిగారు. అంటే రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునే క్రమంలో అవినీతికి పాల్పడి, అడ్డంగా దొరికిపోయిన తరువాత సెక్షన్ 8 గుర్తొస్తోందా? ప్రజా ప్రయోజనాల కోసం అయితే సెక్షన్ 8 అవసరం లేదా? అని ఆయన అన్నారు. టీడీపీ సొంత ప్రయోజనాల కోసం సెక్షన్ 8 పెట్టమంటే ఎలా? అని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News