: రోజంతా సముద్రాన్ని ఈదిన మృత్యుంజయుడు కోటయ్య!


అల్పపీడన ప్రభావంతో గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. గత బుధవారం చేపల వేటకు వెళ్లి, ఈదురు గాలులు, ఎగసిపడే కెరటాల ధాటికి పడవ బోల్తా పడడంతో సముద్రంలో చిక్కుకుపోయిన కాకినాడలోని పగడాలపేటకు చెందిన కోటయ్య ఎట్టకేలకు కాకినాడ చేరాడు. చేపల వేట ముగించి ఇంటికి బయల్దేరేందుకు సన్నద్ధమవుతుండగా, తుపాను తమ పడవను చుట్టుముట్టిందని కోటయ్య చెప్పాడు. బలమైన కెరటాలు, గాలుల ధాటికి పడవ బోల్తా పడిందని, పడవలోని టాప్ కింద మిగిలిన ఆరుగురు చిక్కుకుపోగా, తాను మాత్రం ఎవరో విసిరేసినట్టు దూరంగా సముద్రంలో పడిపోయానని తెలిపాడు. పడవను చేరుకునేందుకు రోజంతా ప్రయత్నిస్తూనే ఉన్నానని, ఇంతలో చీకటి పడిందని, పడవను చేరుకునే క్రమంలో చేతులు, కాళ్లు, వీపుకు గాయాలయ్యాయని, పడవను చేరుకున్నానని ఆనందించే లోపే మరో కెరటం వచ్చి దూరంగా కొట్టేసేదని ఆయన తెలిపాడు. తెల్లారడంతో ఓపిక తెచ్చుకుని ఈతకొట్టానని, ఇక తనకు నూకలు చెల్లాయని భావిస్తుండగా, అటుగా వస్తున్న మత్స్యకారులు తనను చూసి తాడు వేశారని, తాను నీరసించిపోయానని, ఎక్కలేనని చెప్పడంతో వారే తనను రక్షించారని మృత్యుంజయుడు కోటయ్య తెలిపాడు. ఒడ్డుకు చేర్చిన అనంతరం వారు అతనిని కాకినాడలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్చడంతో చికిత్స పొందుతున్నాడు. తన సహచరులంతా సముద్ర జలాల్లోనే విగత జీవులుగా మారారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News