: టి.న్యూస్ కు నోటీసులపై గవర్నర్ కు ఫిర్యాదు


ఓటుకు నోటు కేసులో టి.న్యూస్ కు ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై జర్నలిస్టు సంఘాల నేతలు గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. భారత జర్నలిస్టు యూనియన్ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు గవర్నర్ ను కలిశారు. నోటీసులను వెనక్కి తీసుకునేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ ను కోరారు. టి.మీడియాకు నోటీసులు ఇవ్వడం అక్రమమని, మీడియా స్వేచ్ఛపై ఏపీ ప్రభుత్వ దాడిని ఖండిస్తున్నామని అమర్ అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అల్లం నారాయణ ఆరోపించారు.

  • Loading...

More Telugu News