: కేవలం 3 వేల రూపాయలకే మలేషియా ప్రయాణం
విమాన ప్రయాణాలు బస్సు ప్రయాణాల కంటే తక్కువ ఖర్చుతో పూర్తైపోతున్నాయి. స్వల్ప ఖర్చుతో స్వదేశీ విమాన యానం ఆఫర్ ను దేశవ్యాప్తంగా పలు విమానయాన సంస్థలు అందిస్తున్నాయి. కేవలం మూడు వేల రూపాయల ఖర్చుకే అన్ని పన్నులతో కలిపి మలేసియాకు విమానయానం టికెట్ ను స్పైస్ జెట్ ప్రకటించింది. ఈ ఆఫర్ ఈ నెల 28 లోపు బుక్ చేసుకోవాలని స్పైస్ జెట్ తెలిపింది. ఫిబ్రవరి 15 నుంచి ఆగస్టు 31 వరకు ఈ టికెట్టుపై ప్రయాణించవచ్చని స్పైస్ జెట్ తెలిపింది. ఈ ఆఫర్ లో స్పైస్ జెట్ 30 లక్షల టికెట్లు అందుబాటులో ఉంచడం విశేషం. కొచ్చి నుంచి కౌలాలంపూర్ కు కేవలం 2999 రూపాయలకే టికెట్ ను అందించనుంది. అలాగే కొచ్చి నుంచి హాంగ్ కాంగ్, పెనాంగ్, సింగపూర్ కు 4,019 రూపాయలు టికెట్ ధరగా నిర్ణయించింది. దానితోపాటు మెల్ బోర్న్, పెర్త్, సిడ్నీ వంటి నగరాలకు కేవలం 5,739 రూపాయలతో విమానయానం చేయించనున్నట్టు స్పైస్ జెట్ తెలిపింది. వీటితో పాటు విదేశీ యాత్రికుల సౌకర్యార్థం వివిధ భారతీయ నగరాలకు కూడా ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది.