: షూటింగ్ స్పాట్ లో అరెస్టయిన మలయాళ నటుడు
ఓ కేసులో నిందితుడిగా ఉండి తప్పించుకు తిరుగుతున్న ఓ మలయాళ జూనియర్ నటుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ చిత్రంలో పోలీసు పాత్ర పోషిస్తున్న అతడిని సెట్లోనే రియల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంతోష్ అనే ఈ నటుడు ఓ యువకుడిపై వేధింపుల కేసులో నిందితుడు. తదుపరి అదే యువకుడిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. 2006లో ఈ ఘటన జరుగగా, 9 ఏళ్లుగా పోలీసుల కన్నుగప్పి తిరుగుతూనే ఉన్నాడు. ఆపై మలయాళ చిత్రపరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యాడు. సంతోష్ ను గుర్తించిన పోలీసులు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు.