: సెక్షన్ 8 అమలు చేస్తే మరో ఉద్యమం: మాజీ ఎంపీ విజయశాంతి
చాలా రోజుల తరువాత మాజీ ఎంపీ విజయశాంతి స్పందించారు. అది కూడా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రేపుతున్న సెక్షన్-8 అంశంపై! ఈ సెక్షన్ ను అమలుచేయడం అంటే ఇరు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమేనని అన్నారు. నిజంగానే సెక్షన్ ను అమలుచేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటినుంచి రాజకీయాలకు ఆమె దూరంగా ఉంటున్నారు.