: సినిమా చూపించి టెస్టు పెడతారు... డ్రైవింగ్ లైసెన్స్ కోసం!
డెహ్రాడూన్ ఆర్టీవో కార్యాలయం కొత్త డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసేందుకు ఓ వినూత్న విధానం అవలంబిస్తోంది. అదేంటంటే... లైసెన్స్ కావాలనుకునే వ్యక్తులకు ముందు కార్యాలయంలో ఓ సినిమా చూపిస్తారు. ఆ సినిమా చూసిన తర్వాత ట్రాఫిక్ నిబంధనలపై దరఖాస్తుదారులు ఓ పరీక్ష రాయాల్సి ఉంటుంది. దీనిపై ఏఆర్టీవో సందీప్ సైనీ మాట్లాడుతూ... ప్రస్తుతానికి దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెడుతున్నామని, మంచి ఫలితాలు వస్తే ఇతర జిల్లాల్లోనూ ఈ విధానం అమలు చేస్తామని చెప్పారు. లైసెన్స్ కోసం వచ్చే వ్యక్తులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడమే ఈ విధానం ముఖ్యోద్దేశం.