: అతడిని మేం కిడ్నాప్ చేయలేం: స్పిన్నర్ అశ్విన్ సరదా వ్యాఖ్య


బంగ్లాదేశ్ గడ్డపై టీమిండియా దారుణ పరాభవానికి ఓ యువ బౌలరే ప్రధాన కారణం. తొలి రెండు వన్డేల్లో సంచలనాత్మక బౌలింగ్ తో భారత్ ను బెంబేలెత్తించాడీ లెఫ్టార్మ్ పేసర్. అతడి పేరు ముస్తాఫిజూర్ రెహ్మాన్. వయసు పందొమ్మిదేళ్లే. అయితేనేం, భారత్ తో సిరీస్ ద్వారా వన్డే క్రికెట్ గడప తొక్కి, వన్డే కెరీర్ లో అద్భుతమైన ఆరంభాన్ని అందుకున్నాడు. తొలి వన్డేలో 5 వికెట్లు, రెండో వన్డేలో 6 వికెట్లు ఖాతాలో వేసుకుని ఔరా అనిపించాడు. ముస్తాఫిజూర్ మాయాజాలంతో మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్ బంగ్లాదేశ్ వశమైంది. ఇప్పుడు ఈ యువ కెరటంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా, టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ముస్తాఫిజూర్ అభిమానుల జాబితాలో చేరాడు. మంగళవారం మిర్పూర్ లో మాట్లాడుతూ... నిజంగా అతనో నాణ్యమైన బౌలర్ అని కితాబిచ్చాడు. అతడిని తప్పక గౌరవించాల్సిందేనన్నాడు. అతడి కారణంగానే తాము తొలి రెండు వన్డేలు ఓడిపోయామని, అతడిని కిడ్నాప్ చేయలేమని సరదాగా వ్యాఖ్యానించాడు. ఏదేమైనా, సమష్టిగా ఓటమిపాలయ్యామని అంగీకరించాడీ తమిళతంబి. ఇక, మూడో వన్డేలో నెగ్గడం ద్వారా 'బంగ్లావాష్' ను తప్పించుకుంటామని అన్నాడు.

  • Loading...

More Telugu News