: కేసీఆర్ కు కావాల్సిన వాటికే సెక్షన్లు అమలు చేసుకుంటామంటే కుదరదు: ప్రత్తిపాటి


కేసీఆర్ కు కావాల్సిన వాటికే విభజన చట్టంలోని సెక్షన్లు అమలు చేసుకుంటామంటే కుదరదని ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం అంటే 138 సెక్షన్లని, అందులో ప్రతి సెక్షన్ అమలు కావాల్సిందేనని అన్నారు. సెక్షన్ 8 అందులో ఒకటేనన్న విషయం కేసీఆర్ తెలుసుకోవాలని ఆయన సూచించారు. అన్ని సెక్షన్లు కలిస్తేనే రాష్ట్ర విభజన అని ఆయన పేర్కొన్నారు. కాగా, సెక్షన్ 8 పై టీఆర్ఎస్ ఆందోళనకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News