: బరువు తగ్గే మందుల పేరుతో విజయవాడలో మార్కెటింగ్ మోసం
విజయవాడలో మరో మోసం వెలుగులోకి వచ్చింది. బరువు తగ్గే మందుల పేరుతో 'వుయ్ ఆర్ వన్' అనే సంస్థ కొన్ని నెలల నుంచి మార్కెటింగ్ మోసాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. ఇలా ఆరు నెలలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆ సంస్థ విజయవాడలో రూ.1.16 కోట్లు వసూలు చేసినట్టు వెల్లడైంది. ఈ క్రమంలో బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.15 లక్షల నగదు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పలువురు నిందితుల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.