: ఓడరేవుల్లో 10 శాతం రవాణా పెరగాలి: చంద్రబాబు


వచ్చే పదేళ్లలో ఓడరేవుల్లో 10 శాతం రవాణా పెరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అంతర్జాతీయ జలరవాణా మార్గానికి దగ్గర ఉన్న పోర్టులతో అనుసంధానం చేయాలని చెప్పారు. అంతర్జాతీయ జలరవాణా మార్గానికి కాకినాడ-పుదుచ్చేరి అనుసంధానం కావాలని, జలరవాణాతో రహదారులు, రైళ్లు, అంతర్గత జలరవాణాను అనుసంధానం చేయాలన్నారు. మ్యారిటైం బృహత్ ప్రణాళికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం ఓడరేవులను మెగా కోస్టల్ సిటీలుగా అభివృద్ధి చేయాలన్నారు. యువత నైపుణ్యాభివృద్ధికి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను సంప్రదించాలని చంద్రబాబు చెప్పారు. ఓడరేవుల ద్వారా లావాదేవీల్లో యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని, ఇందుకోసం యువత శిక్షణకు సింగపూర్ మ్యారిటైం, కొరియా రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ తో చర్చలు జరపాలని అధికారులకు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News