: సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్న తెలంగాణ సీఎస్, డీజీపీ


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మలు ఈ సాయంత్రం ఢిల్లీ వెళుతున్నారు. 16 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో జాతీయ ఎస్సీ కమిషన్ నిర్వహిస్తున్న సమావేశానికి వీరు హాజరవుతారు. ఈ భేటీ అనంతరం వీరిద్దరూ కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. ఈ భేటీలో సెక్షన్-8కి సంబంధించి చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News