: బొమ్మ తుపాకీతో సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు... అంతలోనే తుపాకీ గుళ్లకు బలయ్యాడు

ఒక బొమ్మ తుపాకీతో సెల్ఫీ తీసుకోవాలని భావించడమే ఆ కుర్రాడి చావుకు కారణమైంది. ఈ దారుణ ఘటన పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్న ఫైసలాబాద్ సిటీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, టీనేజర్ ఫర్హాన్ తన వద్ద ఉన్న టాయ్ గన్ తో సెల్ఫీ దిగేందుకు సిద్ధమయ్యాడు. అయితే, అతనికి సమీపంలోనే ఉన్న ఓ పోలీసు... ఫర్హాన్ ను దొంగగా భావించాడు. ఫర్హాన్ వద్ద ఉన్నది నిజమైన తుపాకీనే అని భావించి, కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఫర్హాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత ఫర్హాన్ వద్దకు వచ్చిన సదరు పోలీసు... మృతుడి చేతిలో ఉన్నది బొమ్మ తుపాకీ అని తెలుసుకున్నాడు. అయితే, జరగాల్సిన పొరపాటు అప్పటికే జరిగిపోయింది. కాల్పులు జరిపిన పోలీసును ఉన్నతాధికారులు అరెస్ట్ చేశారు.