: ప్రకాశం జిల్లాలో వేడెక్కిన రాజకీయం... ఎమ్మెల్సీ పోరుపై మాటల తూటాలు


ఏపీలో ‘స్థానిక’ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మెజారిటీ స్థానాలను ఏకగ్రీవంగానే దక్కించుకున్న అధికార టీడీపీ... ప్రకాశం, కర్నూలు జిల్లాల స్థానాల కోసం ప్రతిపక్ష వైసీపీతో ఉత్కంఠ పోరుకు సిద్ధపడింది. ఈ రెండు జిల్లాల్లో ప్రతిపక్ష వైసీపీకే స్పష్టమైన మెజారిటీ ఉంది. ఈ నేపథ్యంలో తమ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను టీడీపీ భయపెట్టి కిడ్నాప్ చేసిందని ప్రకాశం జిల్లా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా ఎస్పీకి టీడీపీపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ కుయుక్తులకు పాల్పడుతోందని ఆరోపించింది. అయితే విపక్ష వాదనలను తిప్పికొడుతూ టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ కొద్దిసేపటి క్రితం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ పోరులో తమ పార్టీ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులురెడ్డి విజయం ఖాయమని, ఓటమి భయంతోనే వైసీపీ తమపై అసత్యాలతో దాడి చేస్తోందని విమర్శించారు. ఈ క్రమంలోనే విపక్షం కిడ్నాప్ డ్రామాకు తెరతీసిందని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News