: సెక్షన్-8 పేరిట పరోక్ష పాలనకు అంగీకరించబోమన్న కేసీఆర్... గవర్నర్ కు స్పష్టం చేసిన టిఎస్. సీఎం


గవర్నర్ నరసింహన్ తో రాజ్ భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. దాదాపు గంటకుపైగా జరిగిన సమావేశంలో ఓటుకు నోటు కేసు, సెక్షన్-8 అంశాలపై కీలకంగా చర్చించారు. హైదరాబాద్ లో సెక్షన్-8 విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని గవర్నర్ వద్ద కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలిసింది. ఏడాది కాలంగా ఆంధ్రావారిపై ఎక్కడా దాడులు జరగలేదని, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగలేదని, అలాంటప్పుడు సెక్షన్-8 విధించాల్సిన అవసరమేంటని సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో హైదరాబాద్ లో పరోక్ష పాలనకు అంగీకరించబోమని కేసీఆర్ కరాఖండిగా చెప్పినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News