: సచిన్ సూపర్ ఫ్యాన్ సుధీర్ కు బంగ్లాదేశ్ పోలీస్ సెక్యూరిటీ


సుధీర్ గౌతమ్... క్రికెట్ లెజెండ్ సచిన్ కు వీరాభిమాని. టీమిండియా ఎక్కడ మ్యాచ్ ఆడినా గ్యాలరీలో సందడంతా అతనిదే. చేతిలో మన త్రివర్ణ పతాకం పట్టుకుని, ఒళ్లంతా త్రివర్ణ పతాకం లోని రంగులు వేసుకుని, టెండూల్కర్ అని ఒంటిమీద రాసుకుని మన ఆటగాళ్లను ఎంకరేజ్ చేస్తుంటాడు. బంగ్లాదేశ్ తో రెండో వన్డే ముగిసిన అనంతరం అతనిపై బంగ్లా అభిమానులు దాడికి దిగారు. ఈ వార్త అన్ని చానెళ్లలో ప్రసారమవడమే కాక, అన్ని పత్రికల్లో ప్రచురితమైంది. దీంతో, బంగ్లాదేశ్ పోలీసు అధికారులు అతనికి సెక్యూరిటీని అరేంజ్ చేశారు. ఈ రోజు టీమిండియా ప్రాక్టీస్ చేస్తున్న స్టేడియంకు సుధీర్ వచ్చాడు. ఈ సందర్భంగా ఇద్దరు గార్డులు అతని వెంటే ఉన్నారు. మూడో వన్డే జరిగే రోజున సుధీర్ కు నలుగురు గార్డులు కాపలా ఉంటారని బంగ్లా పోలీసు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News