: సెక్షన్-8 అమలుచేస్తే మరో ఉద్యమం తప్పదు: దేవీ ప్రసాద్
గవర్నర్ ద్వారా హైదరాబాద్ లో సెక్షన్-8 విధించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తే తెలంగాణలో మరో ఉద్యమం తప్పదని టీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ హెచ్చరించారు. కేంద్రం తీరుపై వెంటనే నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అవసరమైతే కార్యాచరణను ప్రకటించి బంద్ కు పిలుపునివ్వాలని సీఎం కేసీఆర్ ను కోరతామని చెప్పారు. సెక్షన్-8 అమలు చేస్తే మరో ఉద్యమం తప్పదని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. సాయంత్రం ఉద్యోగ సంఘాలతో భేటీ అయి, భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో సెక్షన్-8 అమలుకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.