: పగటిపూట ఆహారం తీసుకున్నారని బాలలను ఉరేసిన రాక్షసులు
రంజాన్ మాసం జరుగుతుండగా, పగటిపూట ఆహారం తీసుకున్నారని ఆరోపిస్తూ, ఇద్దరు బాలలను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఉరితీశారు. ఈ దారుణ ఘటన హిస్బా రాజధానిలో జరిగింది. ఇద్దరు బాలల వయసూ 18 సంవత్సరాలకన్నా లోపేనని సిరియా మానవ హక్కుల కార్యకర్త ఒకరు తెలిపారు. వీరిద్దరూ ఆహారం తింటూ దొరికిపోయారని వివరించారు. వీరు మత నిబంధనలు పాటించలేదంటూ వారి శరీరాలపై ప్లకార్డులను ప్రదర్శించారని, ఉదయం బాలలను ఉరేసిన ఉగ్రవాదులు రాత్రి వరకూ వారి దేహాలను అలానే ఉంచారని తెలియజేశారు.