: సండ్ర, మత్తయ్యలకు ఏపీ పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు... కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసిన టి.ఏసీబీ


ఓటుకు నోటు కేసులో ఏ-4 నిందితుడు జెరూసలెం మత్తయ్య, టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలకు ఏపీ పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని కేంద్ర హోంశాఖకు, గవర్నర్ నరసింహన్ కు తెలంగాణ ఏసీబీ ఫిర్యాదు చేసింది. కేసులో ప్రధాన నిందితుడని తెలిసి కూడా మత్తయ్యకు ఎలా రక్షణ కల్పిస్తారని ప్రశ్నించింది. చట్టాన్ని అగౌరవ పరిచేలా ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. ఈ అంశానికి సంబంధించిన ఆధారాలను కూడా ఏసీబీ పంపినట్టు సమాచారం. మరోవైపు, వారిద్దరినీ తెలంగాణకు రప్పించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై న్యాయ నిపుణులతో కూడా చర్చలు జరుపుతోంది. అవసరమైతే, ఈ వ్యవహారంలో కోర్టు అనుమతి కూడా తీసుకోవాలనే భావనలో ఏసీబీ ఉంది.

  • Loading...

More Telugu News