: మదర్ థెరిసా వారసురాలు సిస్టర్ నిర్మల కన్నుమూత
మిషనరీస్ ఆఫ్ చారిటీస్ మాజీ అధ్యక్షురాలు సిస్టర్ నిర్మల (81) కన్నుమూశారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా మరణానంతరం మిషనరీస్ ఆప్ చారిటీస్ బాధ్యతలు స్వీకరించిన సిస్టర్ నిర్మల, సదరు సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించారు. 1997 నుంచి 2009 దాకా మిషనరీస్ ఆఫ్ చారిటీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన ఆమెను 2009 లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాలో సిస్టర్ నిర్మల కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు.