: కేసీఆర్ ముడుపుల గుట్టువిప్పిన ఎర్రబెల్లి


టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. బయ్యారం, ఓబుళాపురం గనులు, పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రశేఖర్ రావుకు భారీగా ముడుపులు ముట్టాయని గుట్టు విప్పారు. వీటి విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి భారీగా ముడుపుల వసూళ్లకు పాల్పడిందని, ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని ఎర్రబెల్లి చెప్పారు.

చంద్రశేఖర్ రావు చర్చకు వస్తే నిరూపిస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్లులో ఈ రోజు మీడియాతో మాట్లాడారు. రాజకీయ ఉనికి కోసమే టీఆర్ఎస్ బయ్యారం గనులపై డ్రామా చేస్తోందని, ఆ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే సీఎం ముందు, పార్లమెంట్ లో నిరసన వ్యక్తం చేయాలని డిమాండ్ చేశారు. బయ్యారం గనులు తెలంగాణ సొంతమని, ఇక్కడి ఇనుప ఖనిజాన్ని విశాఖ స్టీల్ కు తరలించడాన్ని అడ్డుకుని తీరుతామని ప్రకటించారు.

  • Loading...

More Telugu News