: విచిత్ర పరిస్థితి... పైన వర్షం లేదు, కింద వరద!


శ్రీశైలం ప్రాజెక్టుకు చుక్క వరదనీరు లేదు, ప్రాజెక్టూ నిండలేదు. నాగార్జున సాగర్ పరిస్థితి కూడా అంతే... కానీ, సాగర్ కు దాదాపు 120 కిలోమీటర్ల దూరంలోని విజయవాడ వద్ద మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద నిన్నంతా వరద ఉద్ధృతి కనిపించింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం 12 అడుగులుగా ఉంది. 25,372 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 23,200 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీకి ఇరువైపులా ఉన్న కాలువల్లోకి 2,172 క్యూసెక్కుల నీరు వెడుతోంది. బ్యారేజీ 32 గేట్లనూ అడుగున్నర మేరకు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు చేరాలంటే కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు, ఆల్మట్టి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవాల్సి వుంది. ఈ దఫా ఆ ప్రాంతాల్లో వర్షలు పడలేదు. ఇదే సమయంలో గుంటూరు, నల్గొండ జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాల్లో కురిసిన వర్షాల కారణంగానే ప్రకాశం బ్యారేజీకి వరద నీరు చేరిందని అధికారులు తెలిపారు. ఈ వరద తాత్కాలికమేనని వివరించారు.

  • Loading...

More Telugu News