: టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను మేమూ విచారిస్తాం... ‘ట్యాపింగ్’పై కోర్టులో ఏపీ సీఐడీ పిటిషన్


ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీ పోలీసుల దర్యాప్తు మరింత ముమ్మరమైంది. ఈ కేసులో టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను ఏపీ సిట్ అధికారులు విచారిస్తున్నారు. నిన్న విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్ కేంద్రంగా ప్రారంభమైన విచారణలో ఐదు సంస్థలకు చెందిన ప్రతినిధుల విచారణ పూర్తైంది. నేడు మరో నాలుగు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను సిట్ అధికారులు విచారించనున్నారు. తాజాగా టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను తామూ విచారిస్తామని ఏపీ సీఐడీ పోలీసులు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడు జెరూసలెం మత్తయ్య ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను విచారించదలచామని, అనుమతివ్వాలని సీఐడీ అధికారులు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై నేడో, రేపో కోర్టు విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News