: తెలంగాణ అధీనంలోనే హైదరాబాద్: డీజీపీ అనురాగ్ శర్మ
తెలంగాణ ప్రభుత్వ అధీనంలోనే హైదరాబాద్ ఉంటుందని, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలను తెలంగాణ పోలీసులే చూసుకుంటారని డీజీపీ అనురాగ్ శర్మ స్పష్టం చేశారు. వరంగల్ లోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఏసీబీ చూసుకుంటుందని ఆయన అన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల తరహాలో వరంగల్ కమిషనరేట్ ను అభివృద్ధి చేస్తామని అనురాగ్ వివరించారు. పోలీసు శాఖలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని, తెలంగాణలో సుమారు 18 వేల మందిని నియమించాల్సి వుందని తెలిపారు.