: అభివృద్ధి చెందిన ఆ దేశంలో, బయటికెళ్లిన యువతి వేధింపులతో రావాల్సిందే!


ఫ్రాన్స్... ఫ్యాషన్ కు పుట్టినిల్లుగా, అభివృద్ధి చెందిన దేశంగా, ప్రపంచపటంలో స్థిరమైన ముద్రతో నిలిచింది. అయితేనేం, మహిళలపై వేధింపుల విషయంలో మిగతా దేశాలతో పోలిస్తే 'ఘనమైన' చరిత్రనే కలిగివుంది. ఫ్రాన్స్ లోని బస్సులు, రైళ్లలో వందకు వందశాతం మంది యువతులు ఏదో ఒక రకంగా లైంగిక వేధింపులకు గురవుతున్నారట. ఈ విషయాన్ని 'ఫ్రాన్స్ హైకౌన్సిల్ ఫర్ ఈక్వాలిటీ బిట్వీన్ ఉమెన్ అండ్ మెన్' చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. నిత్యమూ తామంతా వేధింపులను ఎదుర్కొంటున్నామని అధ్యయనంలో పాల్గొన్న మహిళలు ముక్తకంఠంతో చెప్పారు. ఈ నివేదిక వెలువడిన వెంటనే ఆ దేశ ప్రభుత్వం రంగంలోకి దిగి, మహిళల భద్రత కోసం పదునైన చట్టాలను ప్రతిపాదించింది. మహిళలను వేధిస్తే క్షమించబోమని తేల్చిచెప్పింది. ఈ చట్టం అమలుతోనైనా వేధింపులు తగ్గితే, అదే పదివేలని ఎదురుచూస్తున్నారు ఫ్రాన్స్ మహిళలు.

  • Loading...

More Telugu News