: చిన్న వయసులోనే మరణించిన భారీ స్థూలకాయుడు!
యూకేలో స్థూలకాయుడు కార్ల్ థామ్సన్ కన్నుమూశాడు. 33 ఏళ్ల కార్ల్ థామ్సన్ 412 కేజీల బరువున్నాడు. కార్ల్ 284 కేజీల బరువు ఉన్నప్పుడు పరీక్షించిన వైద్యులు, అతను తగ్గాలని లేని పక్షంలో జీవించడం కష్టమని సూచించారు. అయినా సరే కార్ల్ థామ్సన్ వారి సూచనలు పట్టించుకోలేదు. దీంతో చిన్న వయసులోనే భారీ కాయానికి తగిన మూల్యం చెల్లించాడు. కాగా, కార్ల్ ప్రతి రోజూ 10 వేల కేలరీల ఆహారం తీసుకునేవాడు. ఆయన మృతి చెందడంతో నివాసం నుంచి ఆయన మృతదేహాన్ని బయటికి తెచ్చేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.