: ఆ నిబంధనతో యూకే నుంచి 30 వేల మంది నర్సులు అవుట్
యూకేలో కొత్తగా ప్రవేశపెట్టనున్న వలసదారుల నిబంధన వల్ల భారీ సంఖ్యలో నర్సులు ఆ దేశాన్ని వీడనున్నారు. ఈ నిబంధన కారణంగా యూరోపియన్ దేశాలకు చెందిన వారు తప్ప మిగిలిన దేశాలకు చెందిన 30 వేల మంది నర్సులు యూకే వీడనున్నారు. వీరిలో అత్యధికులు ఫిలిప్పీన్స్, భారత దేశాలకు చెందిన వారేనని సమాచారం. ఏడాదికి 35 వేల పౌండ్ల వేతనం ఉండాలన్న నిబంధన అమలైతే వీరంతా వెనుకకు మరలాల్సి ఉంటుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. యూకేలో సుమారు 15 వేల మంది భారతీయ నర్సులు పనిచేస్తున్నట్టు యూకే రాయల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వెల్లడించింది.