: ఆ 50 ఏళ్ల మొసలిని పట్టుకునేందుకు వంద మంది వేటగాళ్లు శ్రమించారు


50 ఏళ్ల వయసున్న ఓ మొసలిని పట్టుకునేందుకు ఫిలిప్పీన్స్ లో వంద మంది వేటగాళ్లు శ్రమించారు. అసాధారణ రీతిలో 21 అడుగుల పొడవున్న ఈ మొసలి 2,375 పౌండ్ల బరువు ఉందని వారు వెల్లడించారు. దీనిని పట్టుకునేందుకు పకడ్బందీగా ప్లాన్ వేసిన వేటగాళ్లు, స్థానికులు, ముందుగా అది ఉన్న ప్రాంతంలో నీటిని తొలగించారు. తర్వాత దీనిని బంధించేందుకు క్రేన్లు, ట్రక్కు వినియోగించారు. స్థానికుల సహాయంతో శ్రమించిన వేటగాళ్లు ఎట్టకేలకు ప్రాణాలతో దానిని బంధించారు. ప్రజల సందర్శనార్ధం ఇప్పుడు దానిని జూలో ఉంచనున్నారు. ఈ జూకు మొసలే ప్రధాన ఆకర్షణ కానుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ మొసలి కొద్ది రోజుల ముందు ఓ మనిషిని, పెద్ద దున్నపోతును తినేసినట్టు వారు చెప్పారు.

  • Loading...

More Telugu News