: డ్రెస్సింగ్ రూంలో ఏదో జరిగి ఉంటుందన్న ధోనీ కోచ్
బంగ్లాదేశ్ తో రెండో వన్డే ముగిశాక టీమిండియా కెప్టెన్ ధోనీ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. డ్రెస్సింగ్ రూంలో అనిశ్చితి కెప్టెన్సీపై ప్రభావం చూపి ఉండొచ్చని ధోనీ పర్సనల్ కోచ్ చంచల్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... డ్రెస్సింగ్ రూంలో ఏదో జరిగి ఉంటుందని సందేహం వ్యక్తం చేశారు. డ్రెస్సింగ్ రూంలో చోటు చేసుకున్న పరిణామాలతో ధోనీ అసంతృప్తికి గురై ఉంటాడని ఆయన తెలిపారు. ధోనీ ఆశించిన రీతిలో డ్రెస్సింగ్ రూం వ్యవహారాలు సాగలేదన్న విషయం అర్థమవుతోందని అన్నారు.