: హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయాలి: యనమల
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో విభజన చట్టంలోని సెక్షన్ 8ను అమలు చేయాలని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో రెండు రాష్ట్రాల పోలీసులకు అధికారాలు ఉంటాయని, అయితే వాటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత గవర్నర్ ది అని అటార్నీ జనరల్ తేల్చడంతో హైదరాబాదులో యనమల స్పందించారు. ఉమ్మడి రాజధానిలో రెండు రాష్ట్రాల పోలీసులకు అధికారాలు ఉన్నప్పుడు తక్షణం సెక్షన్ 8ను అమలు చేయాలని అన్నారు. ఉమ్మడి రాజధానిలో రెండు రాష్ట్రాలకు సమాన హక్కులు, అధికారాలు ఉన్నాయని ఆయన చెప్పారు. అటార్నీ జనరల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారని ఆయన పేర్కొన్నారు.