: ఉమ్మడి రాజధానిలో ఇరు రాష్ట్రాల పోలీసులకు అధికారాలు ఉంటాయి!: గవర్నర్ కు అటార్నీ జనరల్ సూచన


'ఓటుకు నోటు' కేసులో దర్యాప్తును పర్యవేక్షించాలని ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కు అటార్నీ జనరల్ సలహా ఇచ్చారు. ఈ మేరకు ఈ కేసులో గవర్నర్ అటార్నీ సలహా కోరారు. ఉమ్మడి రాజధానిలో ఇరు రాష్ట్రాల పోలీసులకు అధికారాలు ఉంటాయని, పునర్విభజన చట్టం సెక్షన్-8 ప్రకారం ఈ అధికారాలుంటాయని అటార్నీ జనరల్ తెలిపారు. అంతేగాక శాంతిభద్రతలపై ఇరు రాష్ట్రాల పోలీసులను గవర్నర్ నేరుగా పర్యవేక్షించవచ్చని సూచించారు. ఓటుకు నోటు కేసులో దర్యాప్తు పురోగతిని నేరుగా తనకు నివేదించమని కూడా ఇరు రాష్ట్రాల పోలీసులను గవర్నర్ కోరవచ్చని పేర్కొన్నారు. అయితే గవర్నర్ కు ఇచ్చినవి కేవలం మౌఖిక సలహాలేనని అటార్నీ జనరల్ కార్యాలయం వెల్లడించింది.

  • Loading...

More Telugu News