: ఒళ్లు వంచి పనిచేసే మాకు యోగా ఎందుకు?: ఎమ్మెల్యే గువ్వల


తెలంగాణ నేతలు, ప్రజలు అంతా ఒళ్లు వంచి పని చేస్తుంటారని... అలాంటి తమకు యోగా ఎందుకని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. యోగా దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు బదులిస్తూ ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీడీపీ నేతలు పదేపదే విమర్శలు చేయడం సిగ్గు చేటని అన్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రతి విషయాన్నీ ఎర్రబెల్లి, ఎల్.రమణలు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ఎప్పుడూ ఆహ్వానించలేదని... తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఎవరైనా వస్తామంటే కాదనమని చెప్పారు.

  • Loading...

More Telugu News