: అమరావతిలో వరల్డ్ క్లాస్ జూ


నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఏపీ సర్కారు కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో, అక్కడ అద్భుతమైన జంతు ప్రదర్శనశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జూతో పాటు లయన్ సఫారీ, నేచుర్ పార్క్ ఏర్పాటు చేద్దామని, అందుకు అనువైన స్థలం చూడాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఏవీ జోసెఫ్ ను ఆదేశించారు. దాంతో, అధికారులు రాజధాని ప్రాంతంలో అటవీప్రాంతం ఎక్కడెక్కడ ఉందన్న దానిపై వివరాలు సేకరించారు. మంగళగిరి, నిడుముక్కల, కొండవీడు ప్రాంతాల్లో అటవీభూములు ఉన్నాయని గుర్తించిన అధికార బృందం గత కొన్ని వారాలుగా అక్కడ పర్యటించింది. దీనిపై విజయవాడ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ కె.మిశ్రా మాట్లాడుతూ... జూ, లయన్ సఫారీ, నేచుర్ పార్క్ నెలకొల్పేందుకు కొండవీడు ప్రాంతం అనుకూలమని భావిస్తున్నామని, త్వరలోనే సీఎంకు నివేదిక ఇస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News