: చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య ఒప్పందం కుదిరిందేమో!: జీవన్ రెడ్డి


ఓటుకు నోటు కేసు దర్యాప్తు మొదలై ఇన్నాళ్లు గడచినా... కేసు ఎందుకు ముందుకు వెళ్లడం లేదని టీకాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందనే ప్రచారం జరుగుతోందని... 'చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య ఏమైనా క్విడ్ ప్రో కో ఒప్పందం కుదిరిందేమో!' అని సందేహం వెలిబుచ్చారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం కూడా పెద్ద నేరమని... దీనిపై ప్రధాని మోదీ మౌనంగా ఎందుకున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News