: అంతమంది యోగా చేయబట్టే ఢిల్లీలో వర్షం పడింది: కిరణ్ బేడీ


ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం నాడు దేశ రాజధాని ఢిల్లీలో భారీ సంఖ్యలో ప్రజలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ యోగా సెషన్ లో పాల్గొనడం తెలిసిందే. రాజపథ్ లో ఈ యోగా కార్యక్రమం నిర్వహించారు. కాగా, మోదీ రాజ్ పథ్ నుంచి వెళ్లిపోయిన కాసేపటికే అక్కడ వర్షం కురిసింది. దీనిపై, బీజేపీ నేత కిరణ్ బేడీ స్పందించారు. అంతమంది ప్రజలు ఒక్కచోట చేరి "శాంతి, శాంతి, శాంతి" అంటూ పఠించడంతోనే తొలకరి వర్షాలు కురిశాయని ట్వీట్ చేశారు. తద్వారా ఉష్ణోగ్రత తగ్గిపోయిందని, వాతావరణం చల్లబడిందని పేర్కొన్నారు. యోగాను ప్రపంచానికి బహుకరించారంటూ ఆమె ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే, కిరణ్ బేడీ ట్వీట్లపై ఢిల్లీ వాసులు ప్రతికూలంగా స్పందించారు. తాము కేజ్రీవాల్ కు ఓటు వేసి మంచి పనిచేశామని నమ్ముతున్నామని, అందుకు కిరణ్ బేడీ ట్వీట్లే నిదర్శనమని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News