: పోలీస్ శాఖలో 18 వేల ఖాళీల భర్తీ: టీఎస్ డీజీపీ
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. త్వరలోనే పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 18 వేల పోస్టులను భర్తీ చేయనున్నామని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ప్రకటించారు. సెక్షన్-8 గురించి వాడీవేడిగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, హైదరాబాదులోని శాంతిభద్రతలన్నీ తెలంగాణ పోలీసుల అదుపులోనే ఉంటాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా, వరంగల్ లో పోలీస్ కమిషనరేట్ భవనం కోసం రూ. 5.50 కోట్లు కేటాయించామని తెలిపారు. తెలంగాణకు కొత్తగా మూడు బెటాలియన్లు మంజూరయ్యాయని... వాటిలో ఒకదాన్ని వరంగల్ లో ఏర్పాటు చేస్తామని అన్నారు.