: మేలు జరుగుతుందని భావిస్తే తప్పుకోవడానికి సిద్ధమే: ధోనీ


బంగ్లాదేశ్ చేతిలో వరుసగా రెండో వన్డేలోనూ టీమిండియా చిత్తుగా ఓడిపోవడం భారత క్రికెట్ వర్గాలను కలవరపరిచింది. పోటీ ఇవ్వకుండానే ధోనీ సేన చేతులెత్తేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వన్డే సిరీస్ లో రాణిస్తారనుకుంటే మరో మ్యాచ్ మిగిలుండగానే బంగ్లాదేశ్ కు సిరీస్ అప్పగించారు. మిర్పూర్ లో ఆదివారం జరిగిన మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో కెప్టెన్ ధోనీ మాట్లాడుతూ... ఒకవేళ నాయకత్వం నుంచి తన తొలగింపు భారత క్రికెట్ కు మేలు జరుగుతుందని భావిస్తే తానందుకు సిద్ధమేనని స్పష్టం చేశాడు. భారత్ క్రికెట్ లో ఏవైనా దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నప్పుడు బాధ్యత వహించేందుకు ఎల్లప్పుడూ తాను ముందుంటానని అన్నాడు. " అన్నీ నా కారణంగానే జరుగుతున్నట్టుంది. బంగ్లాదేశ్ మీడియా నవ్వుతున్నా అందుకు కూడా నేనే కారణమంటారేమో!" అంటూ చమత్కరించాడు. ఓ మీడియా ప్రతినిధి "ఇంకా ఎన్నాళ్లు కెప్టెన్ గా కొనసాగుతారు?" అంటూ శ్లేష ఉపయోగించి అడిగిన ప్రశ్నకు ధోనీ పైవిధంగా బదులిచ్చాడు.

  • Loading...

More Telugu News