: అందరూ యోగా చేస్తే కేసీఆర్ మాత్రం సినిమా ఫంక్షన్ కు వెళ్లారు: ఎర్రబెల్లి


ప్రపంచ యోగా దినోత్సవం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ యోగా దినోత్సవంలో పాల్గొనకపోవడాన్ని టీ.టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తప్పుబట్టారు. ఆ రోజున అందరూ యోగాసనాలు చేస్తే కేసీఆర్ మాత్రం ఓ సినిమా ఫంక్షన్ కు వెళ్లారని అన్నారు. అసలు ఆయన చెప్పే మాటలకు, చేతలకు చాలా తేడా ఉందని ఎర్రబెల్లి ఆరోపించారు. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే హడావుడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికే టీఆర్ఎస్ సర్కారు పాలనపై హైదరాబాదీల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. కేసీఆర్ ఇచ్చే హామీలు చూసి అధికారులే నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News