: పుణే-ముంబై ఎక్స్ ప్రెస్ వేపై విరిగిపడ్డ కొండచరియలు... రహదారిని మూసేసిన అధికారులు
దేశంలోనే అత్యంత అధునాతన రహదారిగా పేరుగాంచిన పుణే-ముంబై ఎక్స్ ప్రెస్ వేను అధికారులు మూసివేశారు. ఐదు రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు తెలుగు రాష్ట్రాలనే కాక మహారాష్ట్ర, తమిళనాడులనూ అతలాకుతలం చేశాయి. తాజాగా కొద్దిసేపటి క్రితం వర్షాల ధాటికి ఎక్స్ ప్రెస్ హైవే పై కొండచరియలు విరిగిపడ్డాయి. పెద్దగా నష్టమేమీ లేకున్నా, రోడ్డుపై బండరాళ్లు పడటంతో నిత్యం రద్దీగా ఉండే ఎక్స్ ప్రెస్ వేను అధికారులు మూసివేశారు. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. మరో మార్గం మీదుగా ట్రాఫిక్ ను మళ్లించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.