: తన కూతురితో సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసిన తండ్రి


తన కూతురు ఓ వ్యక్తితో సహజీవనం చేస్తుండటాన్ని తట్టుకోలేక పోయిన ఆమె తండ్రి ఏకంగా హత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పెండ్యాల రవిశంకర్ (38) వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతను తన భార్య దేవితో కలసి ఉంటున్నాడు. ఇదే సమయంలో, పిఠాపురానికి చెందిన దుర్గాభవాని అనే మరో మహిళతో పదేళ్ల నుంచి సహజీవనం కూడా చేస్తున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఈ రోజు భవాని తండ్రి నాగేశ్వరరావు కూతురు ఇంటికి వచ్చాడు. అదే సమయంలో రవిశంకర్ కూడా ఇంటికి రావడంతో అతనిపై కత్తితో దాడి చేసి, హత్య చేశాడు. అడ్డు వచ్చిన కూతుర్ని కూడా గాయపరిచాడు. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు... నాగేశ్వరరావును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News