: ఐఐటీ ఖరగ్ పూర్ లో త్వరలో ఎంబీబీఎస్ కోర్సు


ఇంజనీరింగ్ విద్యకు ప్రఖ్యాతిగాంచిన ఐఐటీ ఖరగ్ పూర్ తన పరిధిని విస్తరించబోతోంది. త్వరలో ఈ కళాశాలలో ఎంబీబీఎస్ కోర్సును కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఇందుకోసం కళాశాల క్యాంపస్ లోని మూడెకరాల స్థలంలో డాక్టర్ బీసీ రాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ భవనం 2017 కల్లా సిద్ధం కాబోతోంది. 400 పడకలతో ఇక్కడ ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నారు. "ఈ ప్రతిపాదన నిమిత్తం ప్రభుత్వం ఇప్పటికే రూ.230 కోట్ల నిధిని విడుదల చేసింది. నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. 26 నెలల్లోనే భవనం పూర్తవుతుందని భావిస్తున్నాం" అని ఐఐటీ-ఖరగ్ పూర్ డైరెక్టర్ పార్థ ప్రతిం చక్రవర్తి వెల్లడించారు.

  • Loading...

More Telugu News