: ప్రచండ సూర్యుడి దెబ్బకు పాక్ లోని సింధ్ లో అత్యవసర పరిస్థితి


పాకిస్థాన్ లో భానుడి దెబ్బకు ఎండలు మండిపోతున్నాయి. దేశం నిప్పుల కొలిమిగా మారింది. ఈ నేపథ్యంలో వడదెబ్బ ధాటికి ఇప్పటిదాకా 141 మంది చనిపోయారు. ఒక్క కరాచీలోనే 132 మంది వడదెబ్బకు గురై మృతి చెందారు. దీంతో, అన్ని ఆసుపత్రుల్లో సింధ్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేయాలని, తాగు నీటికి లోటు లేకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వృద్ధులు, పిల్లలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు సూచించారు.

  • Loading...

More Telugu News