: నాంపల్లి కోర్టుకు గాలి జనార్దన్ రెడ్డి, శ్రీలక్ష్మి... ఓఎంసీ కేసు విచారణకు హాజరు


కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాదు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి వచ్చారు. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి కోర్టులో నేడు జరగనున్న విచారణకు గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కూడా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి చాలాకాలం పాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఇటీవలే బెయిల్ లభించిన ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో ఓఎంసీకి నిబంధనలకు విరుద్ధంగా సహకరించిన కారణంగా శ్రీలక్ష్మి కూడా కొంతకాలం పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News